UP: మరో ఘోరం.. పట్టపగలే యువతిపై కాల్పులు
Lucknow: ఉత్తర్‌ప్రదేశ్‌లో(uttar pradesh) మరో ఘోరం చోటుచేసుకుంది. డాన్, రాజకీయవేత్త అతీక్ అహ్మద్(atiq ahmed) దారుణ హత్య జరిగిన రెండు రోజుల్లోనే ఓ యువతి హత్యకు గురైంది. జలౌ ప్రాంతానికి చెందిన రోహిణి అనే 21 ఏళ్ల యువతిపై పట్టపగలే కాల్పులు జరిపి చంపేసారు. ఈరోజు ఉదయం రోహిణి కాలేజ్‌లో పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. బుల్లెట్ రోహిణి నుదుటిపై తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు వారిని పట్టుకోవాలని చూడటంతో తుపాకీని అక్కడే వదిలేసి బైక్ మీద పారిపోయారు. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్లలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ రాష్ట్ర లా అండ్ ఆర్డర్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతీక్ అహ్మద్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నట్లే ఆ అమాయకురాలి హత్యను సెలబ్రేట్ చేసుకుంటారా అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిణిపై కాల్పులు జరిపిన వారిలో రాజ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.