Shaakuntalam: స‌మంత కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్!

Hyderabad: టాలీవుడ్ క్వీన్ స‌మంత(samantha) టైటిల్ రోల్‌లో న‌టించిన సినిమా శాకుంతలం(shaakuntalam). గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సోలో రిలీజ్‌తో వ‌చ్చి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు. కానీ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. దాదాపు 80 కోట్ల‌తో ఈ సినిమాను నిర్మించారు. సినిమా(shaakuntalam) రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రూ.8 కోట్లు రాబ‌ట్టింద‌ట‌. స‌మంత స‌క్సెస్‌ఫుల్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా చెప్ప‌చ్చ‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్.. శాకుంత‌లం(shaakuntalam) మూవీకి రివ్యూ ఇస్తూ స‌మంత(samantha) అమ్మ‌మ్మ క‌థ బోరింగ్‌గా చెప్పింది అని రాసేసారు. మూవీ రిలీజ్‌కి ముందు ప్రీమియ‌ర్ షోలు వేసిన‌ప్ప‌టికీ ప్ల‌స్ అవ్వ‌లేదు. అటు ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు పెద్ద‌గా కలెక్ష‌న్లు లేవ‌ని తెలుస్తోంది. ఇక ఖుషీ(khushi) సినిమాతోనైనా సామ్ మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లో ప‌డుతుందేమో చూడాలి.