Heat stroke: అవార్డుల ఈవెంట్.. వడదెబ్బతో 11 మంది మృతి
Mumbai: అవార్డుల కార్యక్రమానికి హాజరై వడదెబ్బ(heat stroke)తో ఏకంగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర(maharashtra)లో చోటుచేసుకుంది. ఖార్గర్ ప్రదేశంలో నిన్న డాక్టర్ అప్పాసాహెబ్ ధర్మాధికారి మహారాష్ట్ర భూషణ్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్నవారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్స్లో చేర్పించారు. వడదెబ్బ తీవ్రంగా తగలడంతో 11 మంది ట్రీట్మెంట్ ఇస్తుండగానే చనిపోయారు. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేసారు. సరైన ఏర్పాట్లు చేయకుండా తీవ్ర ఎండలున్న సమయంలో ఇలాంటి వేడుకలు ఎందుకు నిర్వహించారని మండిపడ్డారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చికిత్స పొందుతున్నవారికి ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ఎవరు చేస్తారు? అని ప్రశ్నించారు.