Dasara: OTT స్ట్రీమింగ్​ ఎప్పుడో తెలుసా?

Hyderabad: నేచురల్​ నాని(Nani), డైరెక్టర్​ శ్రీకాంత్​ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్లో రూపొందిన ఊరమాస్​ యాక్షన్​ మూవీ దసరా(Dasara).  ఈ సినిమాతో ఇద్దరూ కూడా భారీ హిట్ కొట్టేశారు. తొలిసారి ఊర మాస్ క్యారెక్టర్ చేసి సక్సెస్ అయ్యారు నాని. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ క్లాస్, మాస్ ఆడియన్స్ మనసు దోచేసింది.

నాని కెరీర్ లో బిగ్గెస్ట్​ సక్సెస్​ఫుల్​ మూవీగా నిలిచిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మంచి రివ్యూస్ రావడంతో అందరి దృష్టి దసరా ఓటీటీ రిలీజ్ పై పడింది. ఈ నేపథ్యంలో దసరా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమా డిజిటల్ హక్కులు పొందిన నెట్‌ఫ్లిక్స్ లో మే 30 నుంచి చిత్రాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషించారు. తెలంగాణ లోని గోదావ‌రిఖ‌ని సమీపంలో ఉన్న సింగ‌రేణి ప్రాంతానికి చెందిన ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందించి సక్సెస్ అయ్యారు మేకర్స్.తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ సినిమా భారీ సక్సెస్​ అందుకుని వంద కోట్ల క్లబ్​లో చేరిపోయింది.