Ranbir Kapoor: మంచి భర్తను కాను!
Mumbai: బాలీవుడ్(Bollywood) క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్(Alia Bhatt). ఈ స్టార్ కిడ్స్ కొన్నేళ్ళపాటు ప్రేమలో ఉండి గతేడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇటీవలే ఓ కూతురు కూడా పుట్టింది. పాప పేరు రాహా కపూర్(Raha Kapoor). తాజాగా ఈ స్వీట్ కపుల్ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది కూడా. సోషల్ మీడియా వేదికగా వీరికి అభిమానులు, పలువురు ప్రముఖులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక, తాజాగా రణ్‌బీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీ విషయాలు పంచుకున్నాడు. అయితే తాను మంచి భర్త కాదంటూ రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన కూతురు రాహా కపూర్, భార్య ఆలియా భట్ గురించి, వారి మంచి క్వాలిటీస్ గురించి వివరిస్తూ తను మాత్రం మంచి భర్తను కానని చెప్పాడు రణ్‌బీర్ కపూర్. గతంలో ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ కు భార్యగా, తల్లిగా రేటింగ్ ఇవ్వమని అడిగితే ఆమె పాత్ర రెండిటిలోనూ అద్బుతమని చెప్పాడు రణ్‌బీర్. ఇంకా చెప్పాలంటే భార్యగా కంటే గొప్ప తల్లిగా ఉంటుందని బదులిచ్చాడు రణ్‌బీర్. తనకి కూతురు పుట్టిన తర్వాత ఎన్నో విషయాల్ని నేర్చుకున్నానని, ముఖ్యంగా పిల్లల్ని పెంచడంలోని టెక్నిక్స్ తెలుసుకున్నానని చెప్పాడు. కూతురు పుట్టాక తను చాలా మారానని, ఆమె తప్ప తనకు వేరే ప్రపంచమే లేదని చెప్పాడు రణబీర్ కపూర్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం భార్య, కూతురికి మంచి మార్కులిచ్చి తను మాత్రం మంచి భర్త కానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.