టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
Hyderabad: నగరంలోని కుషాయిగూడ(kushaiguda)లో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదం(fire accident)లో ముగ్గురు(three people died) సజీవ దహనమయ్యారు. టింబర్ డిపో(timber dipo)లో వేకువజామున 3 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో.. ఆ మంటలు కాస్త పక్కనే ఉన్న భవనంలోకి వ్యాపించాయి. దీంతో అందులో నివాసముంటున్న దంపతులు సహా వారి చిన్నకుమారుడు సజీవ దహనమయ్యారు. మృతులు యాదాద్రి భువనగిరి(yadhadri bhuvanagiri district) జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్(naresh) (35), సుమ(28), జోషిత్(5)గా గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ మాత్రం తెలియలేదు.
కుషాయిగూడ పోచమ్మ టెంపుల్ వద్ద ఉన్న ఆదిత్య టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించడంతో… టింబర్ డిపో పక్కనే ఉన్న ఇళ్లలోకి మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ.. నిద్రలో ఉండడం వల్ల పొగ పీల్చుకోవడంతో ముగ్గురు చనిపోయి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని.. మంటలను ఆర్పివేస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో టింబర్ డిపో పక్కనే ఉన్న ఇండ్లను అధికారులు ఖాళీ చేయించేశారు. మంటల దాటికి మృతిచెందిన ముగ్గురు మృతదేహాలను బయటకు వెలికి తీశారు.
తరచూ అగ్ని ప్రమాదాలు..
హైదరాబాద్ కేంద్రంగా తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన స్వప్నలోక్ ఘటన మరువక ముందే.. జన సముహంలో నడుపుతున్న టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. అసలు దీనికి అనుమతులు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఆ టింబర్ డిపో నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మెయిన్ రోడ్ పక్కన, అపార్ట్ మెంట్స్ మధ్యలో టింబర్ డిపో ఏర్పాటు చేయడంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారించి.. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.