మీకు గడ్డం వస్తుందా.. రష్మిక పోస్ట్‌కు నెటిజన్ చెత్త కామెంట్
Hyderabad: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా(Rashmika Mandanna)కు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ బాధ రోజురోజుకీ పెరుగుతోంది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్(Bollywood)లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది రష్మిక. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రష్మికకు కెరీర్ మొదటినుంచీ ట్రోల్స్ బాధ తప్పడం లేదు. ఎప్పుడూ ఏదోరకంగా రష్మికను ట్రోల్ చేసే నెటిజనులు ఈసారి మరీ దారుణమైన కామెంట్స్‌తో హద్దులు మీరి ప్రవర్తించారు.
కెరీర్ మొదట్లోనే వరుస అవకాశాలను పట్టేసిన రష్మిక మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వంటి టాప్ హీరోలతో నటించింది. ప్రస్తుతం పుష్ప2(Pushpa2)తో పాటు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే రష్మిక తన ఆలోచనలు, విశేషాలను తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా రష్మిక షేర్ చేసిన ఒక ఫొటోకి దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయారు నెటిజన్లు.
రష్మిక తన ఇన్‌స్టాలో ‘నాకు బుంగమూతి పెట్టడం రావట్లేదు.. ’ అంటూ ముద్దు పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోని జోడించింది. కాగా, ఈ ఫొటోకి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అభిమానులు హార్ట్ ఇమోజీలతో మెచ్చుకుంటుంటే కొందరు మాత్రం హద్దులు మీరి అసభ్యంగా కామెంట్ చేస్తున్నారు. ‘మీకు గడ్డం వస్తుందా..’ అని ఒకరంటే, ‘అరే.. దవడ కింద గడ్డం వచ్చినట్టుందే’ అంటూ ఒకరూ కామెంట్ చేశారు. మరి ఈ కామెంట్స్‌పై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి!