Kangana Ranaut: గుర్తుపెట్టుకో.. ఆరోజు నీ ప‌ని చెప్తా

Mumbai: బాలీవుడ్‌(Bollywood) దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar), నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. చాలాసార్లు నేరుగానే కరణ్(Karan johar)​పై విమర్శలు చేసిన కంగనా సోషల్​ మీడియా వేదికగా మరోసారి మండిపడ్డారు. తన గురించి కరణ్​ మాట్లాడుతున్న ఓ పాత వీడియో షేర్​ చేస్తూ దర్శకురాలిగా పేరుతెచ్చుకున్నాకే అతని​ సంగతి చెబుతానంటూ సవాలు విసిరారు.

నటి కంగనా రనౌత్​ బాలీవుడ్​ ఫిలిం మేకర్​ కరణ్​పై తరచుగా విమర్శలు చేసే సంగతి చేసిందే. తన కెరీర్​ ఆరంభంలో కరణ్​ తనను దారుణంగా అవమానించారన్న కంగన,  ఇటీవలే కరణ్​ కారణంగానే ప్రియాంకా చోప్రా(Priyanka chopra) బాలీవుడ్​ని వదిలి వెళ్లిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా కరణ్​ మాట్లాడిన ఓ పాత ఇంటర్వ్యూ పోస్ట్​ చేసి ‘నీ పనికిమాలిన మాటలకు ధన్యవాదాలు. నేను కూడా ఒక నిర్మాత, దర్శకురాలిగా నిరూపించుకున్న తర్వాత ఇవే మాటలను మీ ముఖాన కొట్టినట్లు చెబుతా’ అంటూ సవాలు విసిరారు.

కాగా, గతంలో ఓ ఇంటర్వ్యూలో కరణ్‌ మాట్లాడుతూ.. ‘కంగనా తరచూ మమ్మల్ని మూవీ మాఫియా అంటుంది. ఇంతకీ ఆమె ఉద్దేశం ఏంటి? మేము ఏం చేస్తున్నాం అనుకుంటోంది? ఆమెకు ఛాన్స్​లు ఇవ్వకపోతే మమ్మల్ని మాఫియా అంటుందా? ఆమె మాటలు నిజం కాదు. మాకు నచ్చిన పనే చేస్తాం. ఆమెతో కలిసి పనిచేసే ఆసక్తి లేదు’ అంటూ కంగనా గురించి మాట్లాడిన వీడియోను ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా దానిపై కంగనా స్పందించారు. కరణ్​ హోస్ట్​ చేస్తున్న ‘కాఫీ విత్​ కరణ్​’(Koffee with Karan) షోపై కూడా కంగనా చాలాసార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరి కంగన మాటలకు కరణ్​ ఏవిధంగా సమాధానం చెబుతారో చూడాలి మరి.