Nani30: రిలీజ్ డేట్‌ లాక్​!

Hyderabad: నేచురల్ స్టార్ నాని(Nani) ఇటీవలే ‘దసరా’(Dasara)  సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో  మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కీర్తి సురేష్​ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దసరా(Dasara) సక్సెస్​ జోష్​లోనే తన నెక్ట్​ మూవీ రిలీజ్​ డేట్​ కూడా లాక్​ చేసినట్టు ప్రకటించారు నాని.

దసరా రిలీజ్​కి ముందే నాని తన తదుపరి సినిమా షూటింగ్​ని మొదలు పెట్టారు. నాని కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నారు. Nani30 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమా పూర్తి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తండ్రికూతుళ్ల బంధం గురించి చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక నాని సరసన అందాల భామ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

నాని 30వ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్​. 21 డిసెంబర్ 2023 రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఓ కొత్త పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.