Aadhaar Card: ఇక ఆధార్ కార్డు ద్వారా పేమెంట్లు

now payments can be done through aadhaar cards

Aadhaar Card: ప్ర‌స్తుతానికి అంద‌రూ డిజిట‌ల్ పేమెంట్స్ బాగా ఉప‌యోగిస్తున్నారు. ఫోన్ పే, పేటీఎం, భార‌త్ పే, జీపే ఇలాంటి ఎన్నో ఉప‌యోగిస్తున్నారు. అయితే త్వ‌ర‌లో మ‌న ఆధార్ కార్డుతోనే ఇక లావాదేవీలు, పేమెంట్లు చేసే అవ‌కాశం రాబోతోంది. భార‌త‌దేశంలో ఆధార్ కార్డుని కీల‌క‌మైన గుర్తింపు కార్డుగా వినియోగిస్తారు. ఆధార్ కార్డు ఎనేబుల్డ్ పేమెంట్ సిస్ట‌మ్ (AePS) ద్వారా పేమెంట్స్, డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ వంటివి చేసుకోవ‌చ్చు. నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ సౌల‌భ్యాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆధార్ కార్డుల‌తో పేమెంట్ కూడా UPI మోడ‌ల్ ద్వారానే జ‌రుగుతుంది.

ధృవీక‌ర‌ణ కోసం ఫింగ‌ర్ ప్రింట్, ఆధార్ నెంబ‌ర్ తీసుకుంటుంది. మీ ప్ర‌ధాన బ్యాంక్ ఖాతాకు AePS లింక్ చేస్తే చాలు. వివిధ ఖాతాల‌కు కూడా లింక్ చేసుకునే స‌దుపాయం ఉంది. AePS ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌చ్చు. మ‌నీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. క్యాష్ డిపాజిట్లు, బ‌దిలీలు కూడా చేసుకోవ‌చ్చు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను బ్యాంకుల్లో కానీ మీసేవా కార్యాల‌యాల్లో కానీ తెలుసుకోవ‌చ్చు.