KTR: తెలంగాణ కొత్త DGP పొంగులేటి శ్రీనివాస్‌కి కంగ్రాట్స్

ktr says ponguleti srinivas reddy is the new dgp of telangana

KTR: తెలంగాణ‌కు కొత్త DGP నియ‌మితుల‌య్యార‌ని అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఆయ‌నే కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ అంటూ సెటైర్ వేసారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌కు చెందిన ప‌లువురు మంత్రులు ఉత్త‌ర కొరియాలోని సియోల్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ కోసం అక్క‌డి న‌దుల‌ను ఎలా సుంద‌రీక‌ర‌ణ చేసారో ప‌రిశీలించేందుకు వెళ్లారు. అక్క‌డి మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ.. న‌వంబ‌ర్ 1 నుంచి 8 వ‌ర‌కు తెలంగాణ‌లో వ‌రుస అరెస్ట్‌లు అవుతాయ‌ని గ‌త ప్ర‌భుత్వంలోని కీల‌క నేత‌లు జైలుకెళ్తార‌ని జోస్యం చెప్పారు. వారు చేసిస స్కాంల‌లో ఒక‌టి దీపావ‌ళి ముందే పేలుతుంద‌ని చూడాల్సిన సినిమా ఇంకా ముందుంద‌ని అన్నారు. దీనిపై KTR స్పందిస్తూ.. తెలంగాణ కొత్త డీజీపీకి అభినంద‌న‌లు అని సెటైర్ వేసారు.