TTD: ఎక్కలేనివారు ఎక్కుతున్నారు.. వద్దు
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేసారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లేవారికి కొన్ని నిబంధనలు పెట్టారు. కొండ ఎక్కే కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, కాళ్ల నొప్పులు, ఆస్తమా, వృద్ధులు కొండ ఎక్కకూడదని చెప్పారు. ఓపిక లేకపోయినా.. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొండ ఎక్కాలని యత్నించి ఇబ్బందిపడుతున్నారని అన్నారు. ఒకవేళ కొండ ఎక్కే సమయంలో అనారోగ్యానికి గురైతే గాలిగోపరానికి చేరుకోగానే 1500వ మెట్టు దగ్గర ఉన్న అశ్విని వైద్యశాలలో చికిత్స తీసుకోవచ్చని తెలిపారు.