Hamas: ప్రామిస్.. యుద్ధం ఆపేస్తాం
Hamas: ఇజ్రాయెల్‌తో ఏడాదిగా చేస్తున్న యుద్ధానికి తెర దించేందుకు హమాస్ సంస్థ ఒప్పుకుంది. కాకపోతే ఇజ్రాయెల్ తమ డిమాండ్లను నెరవేర్చాలని షరతు పెట్టింది. ఈజిప్ట్, ఖతార్ జోక్యంతో త్వరలో ఇజ్రాయెల్‌కి చెందిన చీఫ్ గూఢచారి గాజాలో హమాస్‌తో చర్చలకు కూర్చోనున్నారు.
యుద్ధం ఆపేందుకు హమాస్ విధించిన షరతులివే
గాజాను వదిలేయాలి. ఎక్కడా ఇజ్రాయెల్‌కు చెందిన సైనికులు కనిపించకూడదు
గాజా నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకురావాలి
ఖైదీల మార్పిడి ఒప్పుకోవాలి
గాజాకి సాయం అందాలి.
ఈ నేపథ్యంలో పాలెస్తీనాను ఇదివరకటిగా మార్చేందుకు అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఖతార్ నేతలతో చర్చలు జరిపారు.