బిన్ లాడెన్ నివసించిన చోటే కొత్త ఉగ్రవాద ఫ్యాక్టరీ
Pakistan: మేం ఉగ్రవాదాన్ని పాలు పోసి పెంచుతున్నామా? ఛీ ఛీ అంటూ సమర్ధించుకునే పాకిస్థాన్ ఇప్పుడు మూడు ఉగ్రవాద సంస్థలు ఒసామా బిన్‌లాడెన్ ఒకప్పుడు తలదాచుకున్న చోటే మరో ఉగ్రవాద ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చుంది. లష్కరే తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహ్మద్ సంస్థలు కొత్తగా ట్రైనింగ్ క్యాంప్ పేరుతో మరో ఫ్యాక్టరీని తెరిచాయి. ఈ ఫ్యాక్టరీ పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లో ఉంది. మిలిటరీ పర్మిషన్ లేకుండా ఈ ఫ్యాక్టరీ వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేరట. అంటే వారు సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. పాకిస్థాన్ ఇన్‌టెలిజెన్స్ ఏజెన్సీ ISIకి చెందిన ఓ పాకిస్థానీ జనరల్ ఈ ఫ్యాక్టరీలో జరిగే ఉగ్ర కార్యకలాపాలను పర్యవేక్షించనున్నాడు.
మగ, ఆడవారికి ఆయుధాలను ఎలా వాడాలి అనేది ఈ క్యాంప్‌లో నేర్పిస్తారట. 2011లో బిన్ లాడెన్‌ని అమెరికా ఈ అబోట్టాబాద్‌లోనే మట్టుబెట్టింది. ఎక్కడైతే లాడెన్ శవం దొరికిందో అక్కడే ఈ ఫ్యాక్టరీ క్యాంప్ ఉంది. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పౌరులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన కొన్ని రోజులకే అబోట్టాబాద్‌లో కొత్త ఫ్యాక్టరీ అని ప్రకటించడం గమనార్హం.