Nia Sharma: యోని టైట్ చేయించుకోండి.. నటి యాడ్‌పై దుమారం
Nia Sharma: యోని టైట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పిల్ (ట్యాబ్లెట్) వేసుకోండి అంటూ బాలీవుడ్ నటి నియా శర్మా చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగింది. Vg-3 అనే సంస్థ ఈ పిల్స్‌ని మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ పిల్ ద్వారా వేలాడే యోనిని టైట్ చేసుకోవచ్చట. దీనికి ఆ సంస్థ నియా శర్మను ప్రకటన చేయాల్సిందిగా కోరగా.. ఆమె రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుని ప్రమోట్ చేసేందుకు ఒప్పుకుంది. దాంతో నియాపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత నీచానికి దిగజారి ఇలాంటి యాడ్స్ చేసేందుకు ఎంత తీసుకున్నావ్? సిగ్గు లేదు నీకు అని మండిపడుతున్నారు.
యోని ఎందుకు పల్చబడుతుంది?
దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు అని గుర్తుంచుకోవాలి. మహిళలకు వయసు పెరిగే కొద్దీ శరీరంలో జరిగే హార్మోన్లలో మార్పుల వల్ల యోని భాగంలో కూడా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టాక యోని పల్చబడటం సహజం. ఎందుకంటే అక్కడ ఉండే పెల్విక్ ఫ్లోర్ కండరాలు సాగిపోతాయి. ఒక్కసారిగా బరువు పెరిగిపోయనా.. లేదా తగ్గినా కూడా ఆ భాగంలో మార్పు వస్తుంది. రెగ్యులర్‌గా వ్యాయామం చేయనివారిలో కూడా యోని భాగంలో మార్పులు వస్తాయి. ఒకవేళ దీనిని సమస్యగా భావించే ఆడవారు ఉంటే.. వారు చక్కగా రోజూ కెజెల్స్ లాంటి వ్యాయామాలు చేసుకుంటే సరిపోతుంది. అంతేకానీ.. ఈ నటీనటులు ప్రమోట్ చేసే చెత్తని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.