Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Hyderabad: అప్పులు తీర్చలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కోకాపేటలో నాగ ప్రభాకర్ (27) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగ ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్‌లోని తణుకుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతను గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అప్పుల్లో కూరుకుపోయిన ప్రభాకర్.. తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.