ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు ఇలా సమాధానమిస్తే ఉద్యోగం అస్సలు రాదు
Interview: ఉద్యోగం ఎలా సమాధానం చెప్పాలో ఎలా చెప్పకూడదో బాగా తెలిసుండాలి. ఇంటర్వ్యూలు ఇచ్చే కొద్ది అభ్యర్ధులు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అయితే.. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే.. ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇలా చెప్పకండి. ఇంతకీ ఏంటా ప్రశ్న? ఏంటా సమాధానం? చూద్దాం.
ఇంటర్వ్యూల్లో ఈ మధ్యకాలంలో చాలా మంది మీరు ఎంత త్వరగా జాయిన్ అవ్వగలుగుతారు? అని అడుగుతున్నారు. దానికి మీరు ఉద్యోగం కావాలన్న తొందరలో రెండు వారాల్లోనే చేరతాను.. ఇప్పటికిప్పుడే చేరతాను అని సమాధానం ఇచ్చారనుకోండి.. మీకు ఆ ఉద్యోగం రాదు. ఎందుకంటే ఇలాంటి సమాధానాలు ఇచ్చేవారు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా వేరే కంపెనీలో చేరాలనుకుంటున్నారని అర్థం. ఒకవేళ మీరు ఆల్రెడీ మీరు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసి నోటీస్ పీరియడ్ సెర్వ్ చేసేసి ఉంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఆల్రెడీ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ మరో కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తూ వెంటనే చేరతాను రెండు వారాల్లోనే చేరతాను అంటే మాత్రం మొదటికే మోసం అని గుర్తుంచుకోండి.