Thousand: వెయ్యిని K అని ఎందుకు రాస్తారో తెలుసా?

why k used for thousand

Thousand: వెయ్యి అంటే ఆంగ్లంలో థౌజండ్ (Thousand) అని అర్థం. కానీ అంకె రాసేట‌ప్పుడు మాత్రం T అని కాకుండా K అంటారు. ఇలా ఎందుకు అంటారో తెలుసా?

కిలియోయ్‌ (chilioi) అని ఒక గ్రీక్ ప‌దం ఉంది. ఈ ప‌దానికి అర్థం వెయ్యి (Thousand). ఈ ప‌దం నుంచే వెయ్యికి అనే K పేరు వ‌చ్చింది.

మెట్రిక్ సిస్ట‌మ్‌లో 1,000 యూనిట్ల‌ను కిలో అంటారు. అదే విధంగా వెయ్యి గ్రాముల‌ను కిలోగ్రామ్ అని.. 1000 మీట‌ర్ల‌ను కిలోమీట‌ర్ అని అంటారు.

అలా 1000ని కిలో అంటారు కాబ‌ట్టి.. వెయ్యి రూపాయ‌ల‌ను 1K అని రాస్తాం.

వెయ్యికి T ఎందుకు వాడ‌రంటే.. సైన్స్ ప్ర‌కారం T అంటే ట్రిలియ‌న్. థౌజండ్‌కి T అని పెడితే క‌న్‌ఫ్యూజ్ అవుతారని కేవ‌లం ట్రిలియ‌న్‌నే T అని రాస్తారు.

మ‌న దేశంలోనే కాదు చాలా మ‌టుకు దేశాల్లో వెయ్యి అంకెకి K అనే రాస్తారు.