డెబిట్ కార్డుల‌పై ఆ 16 అంకెలు ఏంటో తెలుసా?

all you need to know about 16 digit number on debit card

Debit Card: మ‌నం వాడే డెబిట్, క్రెడిట్ కార్డుల‌పై 16 డిజిట్ల అంకెలు ఉండ‌టం గ‌మ‌నించే ఉంటారు? అసలు ఆ అంకెలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ విష‌యాలేంటో తెలుసుకుందాం.

మొత్తం 16 అంకెల్లోని మొద‌టి నెంబ‌ర్‌తో మొద‌లైతే అది కార్డు ఇచ్చిన కంపెనీకి సంబంధించిన‌ది. ఉదాహ‌ర‌ణ‌కు 4 లేదా 5వ నెంబ‌ర్‌తో మొద‌లైన కార్డు బ్యాంకులు ఇచ్చిన‌ట్లు లెక్క‌.

మొద‌టి ఆరు అంకెలు ఏ కంపెనీ కార్డు ఇచ్చిందో తెలియజేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు వీసా కార్డు అయితే 4వ నెంబ‌ర్‌తో మొద‌ల‌వుతుంది. 5వ నెంబ‌ర్ అయితే మాస్ట‌ర్ కార్డు అని అర్థం.

7వ నెంబ‌ర్ నుంచి 15వ నెంబ‌ర్ వ‌ర‌కు కార్డు తీసుకున్న వ్య‌క్తికి కేటాయించిన యునీక్ నెంబ‌ర్. ఈ నెంబ‌ర్లే మ‌న బ్యాంక్ ఖాతాల‌కు లింక్ అయ్యుంటాయి. అలాగ‌ని మ‌న బ్యాంక్ ఖాతాల‌కు సంబంధించిన అకౌంట్ నెంబ‌ర్ మొత్తం రివీల్ చేసేయ‌రు.

చివ‌రి అంకెను చెక్‌స‌మ్ (Checksum) డిజిట్ అంటారు. ఈ నెంబ‌ర్ ద్వారా కార్డు స‌రైన‌దా లేదా న‌కిలీదా అని తెలుసుకోవ‌చ్చు.

ఇక కార్డు వెనుక భాగంలో ఉండే 3 అంకెల CVV (Card Verification Value) ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే స‌మ‌యంలో సెక్యూరిటీగా వాడ‌తారు. ఈ నెంబ‌ర్ పేమెంట్ సిస్ట‌మ్స్‌లో రికార్డు అవ్వ‌దు.