Dhanatrayodashi: ధ‌న‌త్ర‌యోద‌శి నాడు ఈ ఒక్క‌టి కొనండి.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

buy salt on Dhanatrayodashi for fortune

Dhanatrayodashi: దీపావ‌ళి వ‌చ్చేస్తోంది. చాలా మంది ఇల్లంతా శుభ్రం చేసుకోవ‌డంలో బిజీగా ఉంటారు. ఎందుకంటే దీపావ‌ళి స‌మ‌యానికి ఇంట్లో ఉన్న అల‌క్ష్మి వెళ్లిపోతేనే ల‌క్ష్మీ దేవి అడుగుపెడుతుంది అని మన శాస్త్రంలో ఉంది. అయితే.. దీపావ‌ళి ముందు వ‌చ్చే ధ‌న‌త్ర‌యోద‌శి నాడు ప్ర‌తి ఇంట్లో ఈ ఒక్క వ‌స్తువు కొని తీరాల‌ట‌. ఈ ఒక్క వ‌స్తువు కొంటే ల‌క్ష్మీదేవి పుల‌క‌రించిపోయి మీకు అష్టైశ్వ‌ర్యాల‌ను ప్ర‌సాదిస్తుంద‌ట‌. ఇంత‌కీ ఆ వ‌స్తువు ఏంటో తెలుసా? ఉప్పు.  ఉప్పులో ల‌క్ష్మీదేవి ఉంటుంది అంటారు. అందుకే ఎప్పుడూ ఇంట్లో ఉప్పు డ‌బ్బా నిండుగా ఉంచుకోవాలి. ఉప్పు అయిపోయింది.. ఉప్పు లేదు అని అన‌కూడ‌దు అని మ‌న పెద్ద‌లు చెప్తుంటారు. చాలా మంది ధ‌న‌త్ర‌యోద‌శి నాడు కాస్త వెండి, బంగారం వంటివి కొంటుంటారు. వీటితో పాటు ఒక ప్యాకెట్ ఉప్పు కూడా కొనుక్కోండి. ఎంతో మంచిది.

ఉప్పు కొనుగోలు స‌మ‌యంలో పాటించాల్సిన‌వి

మీ క‌ష్టార్జితంలో ఉప్పు కొనుక్కోవాలే త‌ప్ప అరువు తెచ్చుకోకూడ‌దు

ధ‌న‌త్రయోదశి నాడు మీరు వంట‌కాలు చేసుకునేట‌ప్పుడు కొత్త‌గా కొని తెచ్చిన ఉప్పును వాడండి

అదే రోజున ఇల్లు అలికే నీటిలో గుప్పెడు ఉప్పు వేసి అల‌కండి. అల‌క్ష్మి వెళ్లిపోయి ల‌క్ష్మీ దేవి త‌లుపు త‌డుతుంది.

మీ ఇంట్లోని ఉత్త‌రం, తూర్పు దిశ‌ల్లో ఒక గిన్నె నిండా ఉప్పు వేసి ఉంచండి. ఆర్థిక క‌ష్టాలు నెమ్మ‌దిగా తొల‌గుతాయి.

పిల్ల‌ల‌కు స్నానం చేయించేట‌ప్పుడు నీటిలో కాసింత ఉప్పు వేసి చేయించండి. న‌ర‌దిష్టి తొల‌గిపోయి పాజిటివ్ ఎన‌ర్జీ సంత‌రించుకుంటుంది.