Danam Nagender: నా ఇంటి ముందు కూడా చెత్త ఎత్త‌రా?

Danam Nagender slams ghmc for not cleaning garbage

Danam Nagender: GHMC వాళ్ళు నా ఇంటి వద్దే చెత్తను తొలగించడం లేదు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. త‌న‌ ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందని ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కొంత చెత్త తీసి మిగతాదంతా అలానే ఉంచేసి వెళ్లిపోయారు అంటూ వాపోయారు. నా ఇంటి ముందే చెత్త తీయ‌రా అని మండిప‌డ్డారు. పారిశుద్ధం విషయంలో GHMC పనితీరు బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. చేసే పని పకడ్బందీగా, మంచిగా చేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అన్నారు.