Police: ఎక్స్క్యూజ్ మీ.. అగ్గిపెట్టె ఉందా?
Police: ఒకప్పుడు పోలీసులంటే కాస్తో కూస్తో భయం ఉండేది. ఇప్పుడు తీటనా కొడుకులు ఎక్కువైపోయారు. ఎంతకు తెగించారంటే.. సిగరెట్ తాగేందుకు ఏకంగా పోలీసులనే అగ్గిపెట్టె అడిగేంత. కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థులు గంజాయి బీడీ అంటించుకోవడం కోసం ఏకంగా ఎక్సైజ్ ఆఫీస్‌కి వెళ్లి అక్కడ అధికారులను అగ్గిపెట్టె ఉందా అని అడిగారు. అది విని వారు నిర్ఘాంతపోయారు. అక్కడే ఉన్న అబ్కారీ పోలీసులు కూడా షాక్ తిన్నారు. అయితే ఆ యువకులు కావాలని ఇలా చేయలేదట. గంజాయి మత్తులో సాధారణ దుకాణం అనుకుని ఎక్కడికైతే వెళ్లకూడదో అక్కడికి వెళ్లి ఇరుక్కున్నారు. విషయం వారికి అర్థమై విద్యార్థులు పరుగులు పెట్టారు. పోలీసులు వారిని వ్యానులో వెంబడించి మరీ పట్టుకున్నారు.