ఇరాక్ అంతుచూసిన ట‌ర్కీ

turkey retaliates after iran terror attack

Turkey: ట‌ర్కీకి చెందిన ఏరోస్పేస్ ఇండ‌స్ట్రీస్ (TUSAS)పై మొన్న మంగ‌ళ‌వారం ఇరాక్ ఉన్న‌ట్టుండి ఉగ్ర‌దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో ఐదుగురు చ‌నిపోగా.. డ‌జ‌న్ల కొద్ది జ‌నాలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దాంతో క‌న్నెర్ర‌జేసిన ట‌ర్కీ ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ప్ర‌తిదాడికి పాల్ప‌డింది. ఇరాక్‌, సిరియాలోని కుర్దిష్ తీవ్ర‌వాదుల‌పై మెరుపుదాడుల‌కు పాల్ప‌డింది. కుర్దిష్ తీవ్ర‌వాదుల‌కు చెందిన దాదాపు 30 ప్రాంతాలను ట‌ర్కీ టార్గెట్ చేసి వేసేసింది. ట‌ర్కీపై దాడి చేసింది తామే అని ఇరాక్‌కి చెందిన కుర్దిస్తాన్ వ‌ర్క‌ర్స్ పార్టీ (PKK) ప్ర‌క‌టించింది. దాంతో ట‌ర్కీ ఏమాత్రం ఆలస్యం చేయ‌కుండా ప్ర‌తిదాడికి పాల్ప‌డి ఇరాక్ అంతు చూసింది.

PKKపై మ‌రిన్ని దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉంటామ‌ని ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డోగ‌న్ హెచ్చ‌రించారు. ట‌ర్కిష్ ఏరోస్పేస్‌లో కుర్దిష్ తీవ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టేందుకు కావాల్సిన డ్రోన్స్, మిలిట‌రీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను త‌యారుచేస్తుంటారు. అందుకే వారు ఏరోస్పేస్‌పై దాడికి పాల్ప‌డ్డారు. PKKకి చెందిన అబ్దుల్లా ఒకాల‌న్ అనే నేత ప్ర‌స్తుతం ట‌ర్కీ జైల్లో శిక్ష అనుభ‌విస్తున్నారు. అబ్దుల్లా మ‌రికొన్ని రోజుల్లో పెరోల్‌పై రిలీజ్ కాబోతున్న స‌మ‌యంలో కుర్దిష్ తీవ్ర‌వాదులు ట‌ర్కీపై దాడికి పాల్ప‌డ్డారు.