గెలిస్తే ఎంజాయ్ చేసారు.. ఓడిపోయాం కాబట్టి భరించండి
Gautam Gambhir: క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని.. గెలిస్తే ఎంజాయ్ చేసినప్పుడు ఓడిపోయినా భరించే గుణం ఉండాలని అన్నారు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. బెంగళూరులో జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్‌లో ఇండియా ఘోరంగా ఓడిపోవడంపై గంభీర్ స్పందించారు.
“” మొన్న కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే తెగ ఎంజాయ్ చేసారుగా. మరి బెంగళూరులో ఓడిపోయినప్పుడు కూడా భరించండి. మ్యాచ్ ఆడేటప్పుడు మాకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి గెలవడం.. రెండోది డ్రా చేసుకోవడం. కానీ మేం గెలవాలని కసిగా ఆడాం కానీ డ్రా చేసుకుని వెళ్లిపోవాలనుకోలేదు. పుణెలో అక్టోబర్ 24న న్యూజిల్యాండ్‌తో మరో మ్యాచ్ ఉంది. శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ లాంటి ట్యాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఎవరిని ఎంచుకోవాలో అర్థంకావడంలేదు “” అన్నారు.