Pilli Manikya Rao: ఆహా యాప్ లాంటిదే దిశా యాప్
Pilli Manikya Rao: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి దిశా యాప్‌కి దిశా చట్టానికి తేడా తెలీడంలేదని అన్నారు తెలుగు దేశం పార్టీ నేత పిల్లి మాణిఖ్యా రావు. గుంటూరులో సహన అనే యువతి రౌడీ షీటర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని తెలిసి ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ.. తాను ప్రవేశపెట్టిన దిశా యాప్‌కి కేంద్ర ప్రభుత్వం 19 అవార్డులు ఇచ్చిందని.. ఆ యాప్‌కు సంబంధించిన బిల్లును నారా లోకేష్ కాల్చేసాడని ఆరోపించారు. దీనిపై మాణిఖ్యా రావు స్పందిస్తూ… దిశా యాప్‌కి దిశా చట్టానికి తేడా తెలీని వ్యక్తి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో అర్థంకావడంలేదని అన్నారు.
“” అసలు దిశా యాప్‌కి దిశా చట్టానికి నీకు తేడా తెలుసా జగన్? దిశా యాప్ అంటే ఆహా, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓ యాప్. దిశా చట్టం అనేది ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దిశా చట్టాన్ని పట్టుకుని నా దిశా యాప్‌కు కేంద్ర ప్రభుత్వం 19 అవార్డులు ఇచ్చింది అంటూ సంకలు గుద్దుకుంటున్నావు. నీ తల్లికి నువ్వు రాసిన సరస్వతి కంపెనీ షేర్లు ఆమెకు నచ్చిన వారికి ఇచ్చుకుంటది. ఆమె తన కూతురికి ఇచ్చుకుంటే సొంత చెల్లి మోసం చేసి లాక్కుందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేసింది నువ్వు కాదా? సొంత తల్లి, చెల్లిపై పిటిషన్ వేసినవాడిని ఈరోజు నువ్వు బయటికి వచ్చి ఆడపిల్లల సంరక్షణ గురించి మాట్లాడుతున్నావ్. ఎవడు నమ్ముతాడు నిన్ను? నీ పార్టీలో ఉన్నవారంతా కామాంధులే. అసలు ఎమ్మెల్సీ సీటు ఎవరికిస్తారు? చదువుకున్నవారికి అనుభవం ఉన్నవారికి ఇస్తారు. నువ్వు ఎవడికి ఇచ్చావ్? ఆల్రెడీ భార్య పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉండగా మరో మగాడి భార్యతో తిరుగుతున్న దువ్వాడ శ్రీనివాస్‌కి ఇచ్చావ్. వాడేదో ఆస్కార్ గెలిచినట్లు ఊరంతా తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అసలు నీ పెంపకం నీ పాలన ఎలా ఉందో చూసుకుని అప్పుడు మాట్లాడు “” అని మండిపడ్డారు.