Sundar Pichai: అందుకే గూగుల్ ఉద్యోగుల‌కు ఉచిత భోజనం

sundar pichai talks about free meals for google employees

Sundar Pichai: ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం గూగుల్.. త‌మ ఉద్యోగుల‌కు ఉచితంగా భోజ‌నాలు పెడుతుందట‌. ఈ విష‌యాన్ని గూగుల్ CEO సుంద‌ర్ పిచాయ్ వెల్ల‌డించారు. ఈ నిర్ణ‌యం వెనుక ఓ కార‌ణం ఉంద‌ని కూడా అన్నారు. ఉచితంగా భోజ‌నాలు అనేది కేవ‌లం గూగుల్ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్ మాత్ర‌మే కాద‌ట‌.. దీని వ‌ల్ల అంద‌రూ క‌లిసి ఒక ద‌గ్గ‌ర కూర్చుని తింటుంటార‌ని.. ఆ స‌మ‌యంలో వారు ఐడియాస్ షేర్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఫ‌లితంగా క్రియేటివిటీ పెరుగుతుంద‌ని పేర్కొన్నారు.

అంద‌రూ క‌లిసి తింటున్న స‌మ‌యంలోనే ఐడియాలు పుట్టుకొస్తాయ‌ని అన్నారు. అందరికీ ఉచిత భోజ‌నాలు పెట్ట‌డం వ‌ల్ల కంపెనీకి ఎక్కువ ఖ‌ర్చే అయిన‌ప్ప‌టికీ తాము లాంగ్ టెర్మ్ బెనిఫిట్ గురించి ఆలోచిస్తున్నామ‌ని అన్నారు. ఉద్యోగుల‌కు న‌చ్చిన పాల‌సీలు గూగుల్ ఇస్తోంది కాబట్టే 90 శాతం మంది అభ్య‌ర్ధులు గూగుల్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారు. గూగుల్ నిర్ణ‌యాలు ఇత‌ర కంపెనీలు కూడా అమ‌లు చేయాల‌ని చూస్తున్నాయ‌ట‌.