Naga Vamsi: కావాల‌నే గుంటూరు కారంని దొబ్బెట్టారు

Naga Vamsi says guntur kaaram was deliberately flopped

Naga Vamsi: కావాల‌నే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన గుంటూరు కారం సినిమా క‌థ‌ను దొబ్బెట్టార‌ని అన్నారు నిర్మాత నాగ‌వంశీ. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గుంటూరు కారం నిజానికి యావ‌రేజ్ అనే చెప్పాలి. క‌నీసం హిట్ కూడా కాదు. త్రివిక్ర‌మ్ మ‌హేష్ నుంచి మ‌రో సినిమా అంటే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటిది అస‌లు సరైన క‌థే లేకుండా ఏదో నాలుగు స్టెప్పుల‌తో గుంటూరు జిల్లా యాస‌తో న‌డిపించేసారు. దీనిపై నాగ‌వంశీ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు. వేరే సినిమాకు సింప‌తీ క‌ల్పించేందుకే గుంటూరు కారం సినిమాని ఏదేదో చేసేసార‌ని అన్నారు. వేరే సినిమా అంటే మ‌హేష్ రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాకేమో అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

గుంటూరు కారంని మ‌రోలా తీయాల‌నుకుంటున్న స‌మ‌యంలో ఇప్ప‌టికి ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మార్చేసి త‌ర్వాత ఓ మంచి సినిమా తీద్దామ‌ని మ‌హేష్ త్రివిక్ర‌మ్‌తో అన్న‌ట్లు అన్న టాక్ కూడా ప్ర‌చారంలో ఉంది. అంటే మ‌హేష్ మ‌న‌సంతా రాజ‌మౌళి సినిమాపైనే ఉంద‌న్న‌మాట‌.