“ఇద్ద‌రికీ కామ‌న్ సెన్స్ లేన‌ట్టుంది”

manoj tiwary says rohit and gambhir lack common sense

Manoj Tiwary: టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై మండిప‌డ్డారు మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారీ. అస‌లు వీరిద్ద‌రికీ కామ‌న్ సెన్స్ ఉందా? అని ప్ర‌శ్నించారు.  మొన్న జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా న్యూజిల్యాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఒక రోజంతా వ‌ర్షం కారణంగా వేస్ట్ అయిన‌ప్ప‌టికీ ముందు బ్యాటింగ్ చేయాల‌ని ఎందుకు నిర్ణయించుకున్నారో త‌న‌కు ఇప్ప‌టికీ అర్థంకావ‌డం లేద‌ని అన్నారు.

“” ఆల్రెడీ రోహిత్ శ‌ర్మ పిచ్ విష‌యంలో కాస్త పొర‌బ‌డ్డాన‌ని అంటున్నాడు. అలాంట‌ప్పుడు త్రీ పేస్ బౌల‌ర్లతో మ్యాచ్ ఆడాల్సింది. అది వ‌దిలేసి బ్యాటింగ్ ఎవ‌డు ఎంచుకోమన్నాడు? ఇద్ద‌రికీ బుద్ధి గ‌డ్డి తిన్న‌ట్లుంది. చివ‌రికి 500 టెస్ట్ వికెట్లు తీసిన అశ్విన్ కూడా స‌రిగ్గా బౌలింగ్ చేయ‌లేదంటే ఏమ‌నాలి? కోచ్ ప‌నే ఎప్ప‌టిక‌ప్పుడు కెప్టెన్‌కు గైడెన్స్ ఇవ్వ‌డం. అది గంభీర్ అస్స‌లు చేయ‌డంలేదు. ఆకాష్ దీప్‌ను టీం నుంచి తొల‌గించ‌డం బాధ‌నిపించింది. ఆ అబ్బాయిని త‌నపై త‌న‌కే కాన్ఫిడెన్స్ కోల్పోయే ప్ర‌మాదం ఉంది “”  అని అభిప్రాయ‌ప‌డ్డారు.