Unstoppable: అరెస్ట్ గురించి చెప్తూ చంద్ర‌బాబు ఉద్వేగం

chandrababu naidu talks about arrest in unstoppable show

Unstoppable: నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 త్వ‌ర‌లో ప్ర‌సారం కాబోతోంది. ఈ షోలో మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. గ‌తేడాది ఆయ‌న ప్రతిప‌క్ష నాయ‌కుడిగా పాల్గొన‌గా.. ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య చంద్ర‌బాబుని షోకి ఆహ్వానించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. మా బావ‌గారు.. మీ బాబు గారు అంటూ ఆయ‌న‌కు గ్రాండ్ వెల్కం చెప్పారు. షోలో అరెస్ట్ స‌మ‌యంలో ఏం జ‌రిగింది అని బాల‌య్య చంద్ర‌బాబును అడిగారు. అప్పుడు ఆయ‌న తాను పడిన మ‌నోవేద‌న గురించి చెప్తూ కాస్త ఉద్వేగానికి లోన‌య్యారు. చంద్ర‌బాబు మాటలు విని ఆడియన్స్ కూడా కంట‌త‌డి పెట్టుకున్నారు.

ఆకాశంలో సూర్య‌చంద్రుల‌న.. భూమిపై చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌లో చూసుకుంటున్నారు అని బాల‌య్య అన‌డంతో చంద్ర‌బాబు కూడా చిరున‌వ్వు న‌వ్వారు. అరెస్ట్ అయిన స‌మ‌యంలో ప‌వ‌న్ త‌న‌ను కల‌వ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు అంత బాధ‌లోనూ స‌మ‌య‌స్ఫూర్తితో మంచి నిర్ణ‌యం తీసుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. చివ‌ర్లో ఆయ‌న త‌ప్పు చేసిన వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తే లేదు అని చంద్ర‌బాబు అన‌డం హైలైట్‌గా నిలిచింది. అక్టోబ‌ర్ 24 నుంచి ఆహాలో అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 ప్ర‌సారం కాబోతోంది.