పెళ్లికి ముందు సెక్స్.. లాభ న‌ష్టాలేంటి?

is sex before marriage good or bad

Lifestyle: ఒక‌ప్ప‌టి రోజుల్లో పెళ్లికి ఒక‌రినొక‌రు చూసుకోవ‌డాలు త‌ప్ప క‌నీసం మాట్లాడుకునే అవ‌కాశం కూడా ఉండేది కాదు. రోజులు మారే కొద్దీ ఆలోచ‌న‌లు, జీవ‌న‌శైలుల్లో పెను మార్పులు వ‌చ్చాయి. ఇప్పుడున్న రోజుల్లో పెళ్లికి ముందే శారీర‌కంగా క‌లుస్తున్నారంటే ఎంత ఫార్వ‌డ్ అయిపోయారో తెలుస్తోంది. అయితే.. పెళ్లికి ముందు లైంగికంగా క‌ల‌వాల‌నుకునేవారంతా త‌ప్పుడు ఉద్దేశంతో ఆలోచిస్తున్నార‌ని అర్థం కాదు.

పెళ్లికి ముందు క‌లిస్తే లాభాలేంటి?

మీ భాగ‌స్వామి గురించి ఇంకా లోతుగా తెలుస్తుంది. మీ మ‌ధ్య ఒక ఎమోష‌న‌ల్ బాండ్ ఏర్ప‌డుతుంది.

మీ భాగస్వామితో శారీరకంగా మీరు కంపాటిబుల్‌గా ఉన్నారో లేదో తెలిసిపోతుంది. ఒక‌వేళ ఆ కంపాటిబులిటీ లేద‌నుకోండి త‌ర్వాత ఏం చేయాలో ఆలోచించ‌వ‌చ్చు.

పెళ్లి చేసుకోవాలా వ‌ద్దా అనే నిర్ణ‌యించుకునే అవ‌కాశం ఉంటుంది.

న‌ష్టాలేంటి?

ప్రొటెక్ష‌న్ లేకుండా క‌ల‌యిక‌లో పాల్గొంటే లైంగిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గ‌ర్భం దాల్చే అవ‌కాశం ఉంటుంది.

ఇద్దరూ పెళ్లి చేసుకుని తీర‌తాం అనుకునే ఉద్దేశంతో క‌ల‌యిక‌లో పాల్గొన్నాక‌.. ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త లేదు అని తెలిస్తే అన‌వ‌స‌రంగా క‌లిసామే అనే రిగ్రెట్‌లో ఉండిపోయే అవకాశం ఉంటుంది.

సెక్స్ అనేది ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్‌ని ఏర్ప‌రుస్తుంది. ఒక‌వేళ బ్రేకప్ అయితే.. ఆ ఎమోష‌న‌ల్ బాండింగ్ వ‌ల్ల మూవ్ ఆన్ అవ్వ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది.

చివ‌ర‌గా.. పెళ్లికి ముందు సెక్స్ అనేది ఈరోజుల్లో కామ‌న్‌గా చూస్తుంటారు. మ‌న సంప్ర‌దాయాలు, సంస్కారాల‌కు విలువిచ్చే వాళ్లు పెళ్లి త‌ర్వాతే దాని గురించి ఆలోచిస్తారు. దీని గురించి ఎన్ని డిబేట్లు పెట్టినా పెళ్లికి ముందు క‌ల‌వ‌డం అనేది త‌ప్పే..!