Sakshi Malik: మంచంపై కూర్చుని ఉంటే ఒక్కసారిగా మీదపడ్డాడు
Sakshi Malik: రెజ్లర్‌గా దేశం తరఫున పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన తన పట్ల లైంగిక వేధింపులు జరగడంతో కుస్తీకి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసారు సాక్షి మాలిక్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, భారతీయ జనతా పార్టీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేస్తూ మూడు నెలల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేసారు. బ్రిజ్ భూషణ్ మైనర్ల నుంచి మేజర్ల వరకు అందరినీ లైంగికంగా వేధించాడని ఆరోపించడంతో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. రెజ్లింగ్ చీఫ్‌గానూ తొలగించారు. అయితే తన పట్ల బ్రిజ్ భూషణ్ ఏం చేసారో వివరిస్తూ సాక్షి మాలిక్ తాను రాసిన విట్నెస్ అనే పుస్తకంలో రాసారు.
“” 2012లో కజకిస్థాన్‌లో జరిగిన ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ ఉన్నప్పుడు ఓ రాత్రి నాకు బ్రిజ్ భూషణ్ మేనేజర్ నుంచి పిలుపు వచ్చింది. మా అమ్మానాన్నలు ఫోన్ కాల్‌లో వెయిట్ చేస్తున్నారని వారితో మాట్లాడాలంటే బ్రిజ్ భూషణ్ ఉన్న గదికి వెళ్లాలని చెప్పారు. నేను వెళ్లాను. నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నారు. అక్కడ కూర్చోవడానికి ఏమీ లేకపోతే మంచంపై కూర్చుని అమ్మానాన్నలతో మాట్లాడాను. ఫోన్ పెట్టేసాక ఒక్కసారిగా బ్రిజ్ భూషణ్ మీదకి దూకి హగ్ చేసుకున్నాడు. నేను విదిలించుకుని ఏడుస్తుంటే ఓ తండ్రిలా పట్టుకున్నాను ఏడ్వకు అని ఓదార్చాడు. కానీ అతని దుర్భుద్ధి నాకు అర్థమైంది. వెంటనే గది నుంచి పారిపోయాను. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను “” అని తెలిపారు.