Chandrababu Naidu: ఎక్కువ మంది పిల్ల‌ల్ని కనండి

Chandrababu Naidu asks ap people to produce more kids

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చాలా మ‌టుకు జిల్లాల్లో పెద్దవాళ్లు మాత్ర‌మే ఉంటున్నార‌ట‌. యువ జ‌నాభా అనేదే లేద‌ని.. చాలా మంది ఇత‌ర రాష్ట్రాల‌కు దేశాల‌కు వెళ్లి నివ‌సిస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఇలాగే వ‌దిలేస్తే ఏపీలో యువ‌త క‌నిపించ‌ర‌ని జ‌నాభా పూర్తిగా ప‌డిపోతుంద‌ని అన్నారు. దీనిని నివారించాలంటే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాల్సిందే అని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు చ‌ట్టంలో ప‌లు మార్పులు కూడా తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. గ‌తంలో ఇద్ద‌రు కంటే ఎక్కువ మంది పిల్ల‌లు ఉంటే స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉండ‌దు అనే చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. దీనిని ఇప్పుడు నిర్వీర్యం చేస్తామ‌ని అన్నారు. ఇద్ద‌రు కంటే ఎక్కువ మంది పిల్ల‌లు ఉంటేనే స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉండేలా కొత్త చ‌ట్టాన్ని తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆల్రెడీ యువ జ‌నాభా లేక జ‌పాన్, చైనా దేశాలు స‌మస్య‌ల్లో ఉన్నాయ‌ని.. ఆ స‌మ‌స్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డాల‌ని అన్నారు.