Piles: పైల్స్ అంటే నమ్మలేదు.. విప్పి చూపించిన ఉద్యోగి
Piles: ఓ వ్యక్తి పాపం కొంతకాలంగా పైల్స్‌తో బాధపడుతున్నాడు. దాంతో ఆఫీస్‌లో ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నాడు. తన పైల్స్ సమస్య తగ్గేంత వరకు సెలవు తీసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం గురించి తన కంపెనీ బాస్‌కి వివరిస్తూ ఓ మెయిల్ పెట్టాడు. సర్.. నాకు పైల్స్ ఉన్నాయి. చాలా నరకంగా ఉంది. రెండు క్షణాల పాటు కూడా నిలబడలేకపోతున్నా. నాకు ఒక 10 రోజులు సెలవు కావాలి అని మెయిల్‌లో పేర్కొన్నాడు. దీనికి ఆ బాస్ స్పందిస్తూ.. పైల్సా? ఎలా నమ్మాలి? ప్రూఫ్ చూపించు అని అడిగాడు. దాంతో ఆ ఉద్యోగికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వెనుక భాగాన్ని ఫోటో తీసి మెయిల్ పెట్టాడు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి లింక్డిన్‌లో వెల్లడిస్తూ.. ఇలా తన ప్రైవేట్ భాగాన్ని ఫోటో తీసి పంపినందుకు తనపై చర్యలు ఉంటాయా? ఉద్యోగం నుంచి పీకేస్తారా అని అడిగాడు. చాలా మంది తీసేసే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు చేసింది మంచి పనే అంటూ రిప్లై ఇస్తున్నారు.