Jabardasth Rakesh: రోజా సాయం పొంది ఆమెనే తిడుతున్నారు

Jabardasth Rakesh slams kiraak rp

Jabardasth Rakesh: వైఎస్సార్ కాంగ్రెస్ నేత రోజా నుంచి సాయం పొందినవారు కూడా ఈరోజు వేరే పార్టీ చెంత చేరి ఆమెను నోటికొచ్చిన‌ట్లు తిడుతున్నార‌ని అన్నారు జ‌బ‌ర్ద‌స్త్ రాకేష్‌. KCR అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు రాకేష్‌. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో తాను ఎందుకు రోజాకు ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌ద్ద‌తు తెలిపాడో వివ‌రించాడు.

“” రోజా నాకు అమ్మ‌తో స‌మానం. జ‌బర్ద‌స్త్‌లో ఉన్న స‌మ‌యంలోనే కాదు బ‌య‌ట కూడా ఆమె న‌న్ను బిడ్డ‌గానే చూస్తారు. నేను సాయం అడిగితే చేసేవారు ఉన్నారు. కానీ నోరెత్తి అడ‌గ‌కుండా నా బాధ అర్థంచేసుకుని సాయం చేసేది ఒక్క రోజా గారు మాత్ర‌మే. రోజా నాకే కాదు చాలా మందికి సాయం చేసారు. ఆమె నుంచి ల‌బ్ధి పొందిన‌వారు కూడా ఈరోజు ఆమెను నోటికొచ్చిన‌ట్లు తిడుతున్నారు. అది వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాను “” అని తెలిపారు. రాకేష్ ప‌రోక్షంగా కిరాక్ ఆర్పీనే అంటున్నారంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి.