పాక్ యువతిని పెళ్లాడిన BJP కార్పొరేటర్ కొడుకు
BJP: భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ కొడుకు పాకిస్థానీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. BJPకి చెందిన తహ్సీన్ షాహిద్ అనే కార్పొరేటర్ తన కొడుకు మహ్మద్ అబ్బాస్ హైదర్‌ను పాకిస్థాన్‌లోని లాహోర్కి చెందిన జహ్రా అనే యువతితో నిన్న వివాహం జరిపించాడు. అది కూడా ఆన్లైన్లో ఈ పెళ్లి జరగడం వైరల్‌గా మారింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అంత మెరుగ్గా లేనందున పెళ్లి కొడుకు అబ్బాస్‌కి వీసా రాలేదు. మరోపక్క వధువు తల్లి అనారోగ్య సమస్యతో ఐసీయూలో ఉంది. దాంతో ఆన్లైన్లోనే నిఖా నిర్వహించారు. త్వరలో తన భార్యకు ఇండియన్ వీసా రావాలని కోరుకుంటున్నట్లు అబ్బాస్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వేడుకకు చెందిన పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు హాజరయ్యారు.