ఇదెక్కడి కండోమ్ యాడ్ రా బాబూ..!
Annu Kapoor: కొన్ని యాడ్స్ ఎలా ఉంటాయంటే.. పోకిరి రేంజ్లో ట్విస్ట్‌లు ఇస్తుంటారు. అలాంటి యాడ్నే బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ చేసారు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత తెలిసింది ఏంటంటే… అది కండోమ్ యాడ్ అని. దాంతో చాలా కాలం తర్వాత ఒక మంచి యాడ్ చూసామంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ ఈ యాడ్‌లో ఏముందంటే… పై ఫోటోలో కనిపిస్తున్న నటుడు అన్నూ కపూర్ ప్రతి ఒక్కరికి ఒక స్నేహితుడు తప్పనిసరిగా ఉండాలి అనే డైలాగ్‌తో మొదలుపెడతారు. ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు వెనకే ఉన్న ఇద్దరు యువకులు ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. ఒక నిజమైన స్నేహితుడే ఎప్పుడూ మీతోనే ఉంటాడు. మీ శరీరంలోని ఒక అవయవంలా మీతోనే ఉంటాడు. ఆ స్నేహితుడు మీతో ఉంటే మీ ఆనందం రెట్టింపవుతుంది. ఓ కవచంలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అందుకే ఎంచుకోండి డ్యూరెక్స్ ఫిట్ కండోమ్.. మీ నిజమైన స్నేహితుడు అని చెప్పి ముగిస్తాడు. అసలు ఇది కండోమ్ యాడ్‌ని చివరి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోతారు. ఇప్పటివరకు చాలా కండోమ్ యాడ్స్ వచ్చాయి. కానీ ఆ యాడ్స్‌లో పిల్లలు పెద్దలు చూడలేని అసభ్యకర సన్నివేశాలు పెడుతుంటారు. కానీ ఇలా ట్విస్ట్‌తో పాటు మంచి సందేశాన్ని కూడా ఇచ్చేలా ప్రకటనను తయారుచేసినందుకు ప్రశంసలు వస్తున్నాయి.