మా మధ్య సెక్స్ అయిపోయింది.. శాకుంతలం నటుడి భార్య సంచలనం
Kabir Bedi: కబీర్ బేడి.. ఈ పేరు బాలీవుడ్లో తెలీని వాళ్లు ఉండరు. తెలుగు వారికి కూడా కొద్దో గొప్పో సుపరిచితమే. మన తెలుగు సినిమాల్లో నటించకపోయినప్పటికీ.. 2023లో రిలీజ్ అయిన సమంత నటించిన శాకుంతలం సినిమాలో కశ్యప మహర్షి పాత్రలో నటించారు. ఆయన మాజీ భార్య ప్రతిమా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సెన్సేషనల్‌గా మారింది. కబీర్ బేడి, ప్రతిమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఒకానొక సమయంలో ప్రతిమ కబీర్‌ని అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబితో ఎఫైర్ పెట్టుకోమని చెప్పిందట. అలా కబీర్ బేడి పర్వీన్ బాబి వద్దకు వెళ్లిపోయారు. కానీ తనను పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్లిపోతాడని మాత్రం అనుకోలేదని ప్రతిమ చెప్పారు.
“” కబీర్ బేడి, పర్వీన్ బాబితో ఎఫైర్ పెట్టుకోమని చెప్పింది నేనే. ఆయన పర్వీన్ దగ్గరికి వెళ్లిపోయారు. కానీ నన్ను, పిల్లల్ని పట్టించుకోడని మాత్రం అనుకోలేదు. కొన్నాళ్లకు పర్వీన్ కూడా కబీర్‌ని వదిలేసింది. కానీ నేను మళ్లీ కబీర్‌కి దగ్గరకావాలని అనుకోలేదు. ఎందుకంటే మేం ఓపెన్ రిలేషన్షిప్లోనే ఉన్నాం. మా మధ్య సెక్స్ అయిపోయింది. పిల్లలు పుట్టేసారు. ఇక నా శరీరం ఆయన సొంతం కాదు కదా. విడాకులు అనేవి ఒక పేపర్‌పై అగ్రీమెంట్ అయినప్పుడు పెళ్లి కూడా అంతే కదా. ఇప్పుడు నేను నా పిల్లలు సంతోషంగానే ఉన్నాం. కబీర్ మాత్రం నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. కానీ అతనితో కలిసి ఉండాలని అనుకోవడం లేదు “” అని తెలిపారు. అయితే ఎప్పుడో జరిగిన స్టోరీ గురించి ప్రతిమ ఇప్పుడెందుకు ఇంటర్వ్యూలో ఇంత ఘాటుగా స్పందించారో..!