Suriya 42: టైటిల్​ రివీల్ చేయ‌నున్న ప్ర‌భాస్‌?

Chennai: కోలీవుడ్​ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న తాజా చిత్రం ‘Suriya42’అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఫిక్షనల్ కథతో రూపొందుతున్నఈ సినిమాను దర్శకుడు శివ(Shiva) తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్​ఇండియా మూవీగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా టైటిల్​ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఏప్రిల్​ 16న గ్రాండ్​గా టైటిల్​ రిలీజ్​ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఈ సినిమాకు ఎలాంటి పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా రానున్న సూర్య 42 మూవీకి సంబంధించిన టైటిల్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో రివీల్ చేయించేందుకు ప్లాన్​ చేసిందట చిత్రబృందం. ఈ క్రమంలోనే తెలుగులో సూర్య 42 టైటిల్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని.. అందుకే ఈ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ(Disha Patani) హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాను హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ సౌత్​ (SAREGAMA South) భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.