IND vs NZ: ధోనీ రికార్డును బ్రేక్ చేసిన పంత్
IND vs NZ: మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు బ్రేక్ చేసి తన పేరును లిఖించుకున్నాడు రిషభ్ పంత్. ప్రస్తుతం ఇండియా న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో 2500 టెస్ట్ పరుగులు తీసిన వీరుడిగా పంత్ పేరుగాంచాడు. అది కూడా కేవలం 62 ఇన్నింగ్స్‌తోనే సాధించాడు. ఈ రికార్డు ఇదివరకు ధోనీకి మాత్రమే ఉంది. ధోనీ 69 ఇన్సింగ్స్‌లో 2500 పరుగులు తీస్తే.. పంత్ మాత్రం కేవలం 62 ఇన్సింగ్స్‌లోనే బాదేసాడు. ధోనీ కంటే ముందు ఫారూఖ్ ఇంజినీర్ అనే మాజీ ఇండియన్ క్రికెటర్ 82 ఇన్సింగ్స్‌లో 2500 టెస్ట్ రన్స్ తీసిన రికార్డు ఉంది. ఈ రికార్డును ధోనీ బ్రేక్ చేయగా.. ఇప్పుడు ధోనీ రికార్డును పంత్ బీట్ చేసేసాడు.