తన ముందు తల దువ్వుకున్నారని శిరోముండనం చేయించిన ఎస్సై

nagar kurnool si tonsures youth heads because they combed in front of him

Viral News: తన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువ‌కుల‌కు శిరోముండనం చేయించాడు ఓ ఎస్సై. ఈ ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్‌లో చోటుచేసుకుంది. లింగాలలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బందితో ముగ్గురు యువ‌కులు గొడ‌వ‌ప‌డ్డారు. దాంతో పోలీసులు వారిని స్టేష‌న్‌కు తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చారు. ఆ స‌మ‌యంలో ఆ ముగ్గురు యువకులు త‌న ముందే తల దువ్వుకోవ‌డంతో ఎస్సై జగన్‌ ఆగ్రహం చెంది వారికి స్టేష‌న్‌లోనే శిరోముండనం చేయించాడు. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. అత‌ని పరిస్థితి విషమంగా ఉంది.