ఈ శాంతి ఒప్పందం మీకు ఓకేనా?

pcb deal with bcci for champions trophy

Champions Trophy: 2025 ఛాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌ల‌కు ఈసారి పాకిస్థాన్ ఆతిథ్యం వ‌హించ‌నుంది. కానీ శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా ఇండియా పాకిస్థాన్‌కు వ‌చ్చి ఆడేది లేద‌ని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్‌లు జ‌ర‌గాలంటే దుబాయ్, శ్రీలంక‌కు వెళ్తే బెట‌ర్ అని సూచించింది. ఇందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స‌సేమిరా అంటోంది.

అన్ని మ్యాచ్‌లు పాక్‌లో ఆడాల‌ని.. లేదంటే టీమిండియా ఆడ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని అంటోంది. ఈ నేప‌థ్యంలో పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి ఓ ఐడియా ఇచ్చింది. పాకిస్థాన్‌తో జ‌రిగే మ్యాచ్‌ల‌కు మాత్రమే పాక్‌కి వ‌చ్చి.. ఆడేసి.. ఢిల్లీలో కానీ ఛండీగ‌డ్‌లో కానీ స్టే చేయొచ్చ‌ని చెప్పింది. ఈ శాంతి ఒప్పందం ఓకే అయితే ఎలాంటి స‌మ‌స్యా లేకుండా ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌రుగుతుంద‌ని తెలిపింది. అయితే ఈ ఒప్పందం గురించి పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో మాట వ‌రుస‌కు మాత్రమే అంది. ఇంకా రాత‌పూర్వ‌కంగా ఇవ్వ‌లేదు. దీనిపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బీసీసీఐ తెలిపింది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. పాకిస్థాన్‌లోని క‌రాచీ, లాహోర్, రావ‌ల్పిండి ప్రాంతాల్లో మ్యాచ్‌లు జ‌రుగుతాయి.

ఫిబ్ర‌వ‌రి 20 – ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్

ఫిబ్ర‌వ‌రి 23 – ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్

మార్చి 2 – ఇండియా వ‌ర్సెస్ న్యూజిల్యాండ్

ఈ మూడు మ్యాచ్‌లు లాహోర్‌లో జర‌గ‌నున్నాయి. సెక్యూరిటీ స‌మ‌స్య‌ల కార‌ణంగా 2008 త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లి ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు.