PCB: పాక్ క్రికెటర్ల గురించి గంభీర్ బాధపడ్డారు
PCB: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాకిస్థాన్ క్రికెట్ టీం గురించి బాధపడ్డారని అన్నారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్ అకీబ్ జావేద్. శ్రీలంకతో పాకిస్థాన్ సిరీస్ ఆడుతున్న సమయంలో అకీబ్ గౌతమ్ గంభీర్‌ను కలిసారు. ఆ సమయంలో గౌతమ్ అకీబ్‌తో ఇలా అన్నారట. ఏమైంది పాకిస్థాన్ క్రికెటర్లకు? ఎంత ట్యాలెంటెడ్‌గా ఉండేవారు. ఉన్నట్టుండి ఏం జరిగింది అని అడిగి బాధపడినట్లు అకీబ్ తెలిపారు.
ఒకప్పుడు ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోందంటే క్రికెట్ అంటే ఏంటో తెలీని వారు కూడా టీవీలకు అతుక్కుపోయి వీక్షించేవారని.. దానికి కారణం రెండు టీంలు పోటీ పడి ఆడటమే అని గంభీర్ తనతో చెప్పారట. ఇప్పుడు పాకిస్థాన్ టీం కుప్పకూలిపోతుంటే ఇక ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌లో మజా కూడా ఉండదని అన్నట్లు అకీబ్ తెలిపారు.