Mohanlal: కొత్త మూవీ ఫ‌స్ట్‌లుక్ మామూలుగా లేదుగా..!

Hyderabad: మలయాళ స్టార్​ హీరో మోహన్ లాల్(Mohanlal)​కి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. జనతా గ్యారేజ్(Janatha Garage)​తో నేరుగా తెలుగువారిని అలరించారు మోహన్​లాల్(Mohanlal)​. ఆయన నటించిన లూసీఫర్(Lucifer)​, మనమంతా(Manamantha).. వంటి సినిమాలు తెలుగులోనూ మంచి ఆదరణ పొందాయి.

ఇక మోహన్​లాల్​ నటించిన తాజా చిత్రం ‘మలైకొటై వాలిబన్'(Malaikottai Vaaliban). ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటినుంచి అప్​డేట్స్​ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మలైకొటై వాలిబన్ అంటే మలైకొటైకు చెందిన యువకుడు అని అర్థం. బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ సినిమాని రూపొందిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విషు(Vishu) పర్వదినాన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎంత ఉత్కంఠగా ఉండనుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్ల పై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ లు నిర్మాతలు గా సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి రాగా, అవేవీ ‘ మలైకొటై వాలిబన్’ కు సంబంధించినవి కావని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం మలయాళంతో పాటుగా ఇతర ప్రముఖ భాషలన్నింటిలో విడుదల కానుంది.