కళ్లు తిరిగి పడిపోతే ఎవ్వరూ హాస్పిటల్‌కు తీస్కెళ్లలేదు
Samantha: షూటింగ్ సమయంలో సెట్లో కళ్లు తిరిగి పడిపోతే తనను ఎవ్వరూ హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్లలేదని అన్నారు సమంత. ఆమె నటించిన సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కాబోతోంది. రాజ్, డీకేలు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఓరోజు సిటాడెల్ సెట్‌కి రాగానే నాకు కళ్లు తిరిగి పడిపోయా. అప్పుడు నన్ను ఎవ్వరూ కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లలేదు అని సమంత అనగానే.. పక్కనే ఉన్న స్టోరీ రైటర్ సీతా కలగజేసుకుని.. మేం డాక్టర్‌కి కాల్ చేసాం అన్నారు. అప్పుడు సమంత.. ఏ డాక్టర్‌కి అని అడగ్గా.. మీరు కళ్లు తిరిగి పడిపోయారు. మీకేమీ గుర్తులేదు అన్నారు. అప్పుడు సమంత కంటిన్యూ చేస్తూ.. నేను స్పృహలోకి వచ్చాక షూటింగ్లో పాల్గొనాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు వేసిన సెట్ ఒకే ఒక్క రోజులో తీసేయాలట. దాంతో నేను చేద్దామనుకున్నాను. కానీ నాకు సీన్ గుర్తులేకపోవడంతో వెంటనే షూటింగ్ ఆపేసారు అని సమంత తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు.