Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య అదిరిపోయే రియాక్షన్
Ananya Nagalla: ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇతర సినీ పరిశ్రమలో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదం రచ్చకెక్కింది. కేరళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్టు బయటికి వచ్చినప్పటి నుంచి ఇతర ఇండస్ట్రీలకు చెందిన లైంగిక వేధింపుల కేసులు మెల్లిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లల్లో పలువురు జర్నలిస్ట్‌లు హీరోయిన్లను క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు తెలుగమ్మాయి అయిన అనన్య నాగళ్లకు కూడా ఈ ప్రశ్న ఎదురైంది.
ఆమె నటించిన పొట్టేల్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా జర్నలిస్ట్ అనన్యను ప్రశ్నిస్తూ.. “” ఈరోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ ఎంత పెద్ద వివాదానికి దారి తీస్తోందో మీరూ చూస్తున్నారు. అన్ని చోట్లా జరుగుతున్నా సినీ పరిశ్రమపైనే ఎక్కువగా బురద జల్లుతున్నారు. సినిమాకు సంతకం చేయించుకోవడానికి ముందే కమిట్మెంట్ అడిగేస్తున్నారు. దీనిపై మీరేమంటారు. కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు ఇవ్వకపోతే ఒక రేటు ఉంటుందా? “” అని అడిగింది.
దీనికి అనన్య సమాధానమిస్తూ.. “” సినిమాకి ముందే కమిట్మెంట్ అడిగేస్తారని 100 శాతం మీరెలా చెప్పగలుగుతున్నారు? ఇది చాలా తప్పండి. మీరెలా అంటారు అలా? మీకు ఎవరు చెప్పారో ఈ కమిట్మెంట్ గురించి నాకు తెలీదు కానీ.. ఇండస్ట్రీలో పనిచేస్తున్న నేను చెప్తున్నా. నన్ను ఎవ్వరూ అలాంటి కమిట్మెంట్ ఇవ్వమని అడగలేదు. దయచేసి ఇలా మీకు మీరే అనేయకండి “” అని ఘాటుగా సమాధానమిచ్చారు.