Nithya Menen: సాయి పల్లవికి రాని జాతీయ అవార్డు.. నిత్య మండిపాటు
Nithya Menen: ప్రముఖ నటి నిత్యా మేనన్ నటించిన తిరుచిత్రాంబళం సినిమాకు గానూ ఆమెకు ఈ ఏడాది జాతీయ అవార్డు లభించింది. అయితే.. సాయి పల్లవి నటించిన గార్గి సినిమా కూడా జాతీయ అవార్డుకు నామినేట్ అయ్యింది. కానీ అవార్డు మాత్రం నిత్యాకే వరించింది. దాంతో సాయి పల్లవి అభిమానులు నిత్యా మేనన్‌ను టార్గెట్ చేసారు. నిత్య కంటే సాయి పల్లవే బాగా నటించిందని.. ఆమెకు రావాల్సిన అవార్డును నిత్యకు ఇచ్చారని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై నిత్య స్పందించారు.
“” ఇదొక్కటే జాతీయ అవార్డు కాదు కదా. ఇంకా వస్తూనే ఉంటాయి.. అవార్డులు ఇస్తూనే ఉంటారు కదా. ఎవరికి ఎప్పుడు సమయం రావాలో అప్పుడు వస్తుంది. జీవితంలో ఎంతో కొంత సాధించినవారు ఇలా ఇతరులపై కామెంట్స్ చేయరు. నాపై కామెంట్స్ చేస్తున్నవారంతా పనీ పాటా లేని వారే. నన్ను టార్గెట్ చేస్తుంటారు కానీ నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ఇతరుల జీవితాల గురించి తప్పుగా మాట్లాడేవారు మా జీవితాల్లో భాగం ఎప్పటికీ అవ్వరు. మీరు నలుగురూ గుర్తించే పని చేసి అప్పుడు ట్రోల్స్ చేయండి “” అని మండిపడ్డారు.