Anee Master: ఆపద వస్తే ముందుండేది జానీ మాస్టరే
Anee Master: తనకు తెలిసినంత వరకు జానీ మాస్టర్ తప్పు చేసి ఉండరు అని అన్నారు కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్. తనకు పెళ్లై పిల్లలు పుట్టాక సినిమాల్లో కొరియోగ్రఫీ అవకాశాలు లేకపోతే జానీ మాస్టరే తనకు రచ్చ సినిమాలో డిల్లకు డిల్లకు సాంగ్‌లో అవకాశం ఇప్పించారని అన్నారు. ఈ మేరకు ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.
“” డ్యాన్సులు ఎవరైనా చేస్తారు. కానీ ఒక కొరియోగ్రాఫర్ చేయించిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఇళ్లల్లో వైరల్ అయ్యి ఇతరులు కూడా వేయాలంటే అది చిన్న విషయం కాదు. అంతటి పాపులారిటీ జానీ మాస్టర్‌కి ఉంది. నేను దాదాపు అందరు కొరియోగ్రాఫర్లతో కలిసి పనిచేసాను. జానీ మాస్టర్‌తో కూడా కలిసి పనిచేసాను. నేను జానీ మాస్టర్‌తో కలిసి పనిచేసినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా నాతో తప్పుగా ప్రవర్తించింది లేదు.
ఇప్పుడు జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయి అక్కా నాకు అవకాశాలు ఇప్పించండి అని నాకు మెసేజ్ చేసింది. అప్పుడు నేను ఒక్కటే చెప్పా. నేను నెలలో రెండు రోజులు మాత్రమే బిజీగా ఉంటాను. కానీ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌ల దగ్గరికి వెళ్తే నెలలో కనీసం 15 రోజులు వర్క్ ఉంటుందని చెప్పా. ఆ అమ్మాయికి యూనియన్‌లో కార్డు లేకపోతే జానీ మాస్టరే దగ్గరుండి ఇప్పించారు. మాస్టర్ నాకు దైవంతో సమానం అని మాట్లాడిన అమ్మాయి ఇలా కేసు పెట్టడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు.
మా యూనియన్‌లో ఎవరికైనా అనారోగ్యం చేసిందంటే ముందుగా దగ్గరుండి ఆర్థిక సాయం చేసేది శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్‌లే. వీరిద్దరే తమకు తోచినంత డబ్బులు ఇచ్చి సాయం చేస్తుంటారు. జానీ మాస్టర్ గురించి ఎన్నో ఆరోపణలు చేసారు. మరి ఆయన చేసిన మంచి గురించి ఎందుకు చెప్పడం లేదు? మేం కూడా జానీ మాస్టర్ తప్పు చేసి ఉండరు అనే అనుకుంటున్నాం. కేసు విచారణ జరుగుతుండగా ఆయన్ను దోషిగా పెట్టి ప్రెస్ మీట్లు పెట్టేయడం అస్సలు కరెక్ట్ కాదు “” అని తెలిపారు.