ఒక మనిషి 3 జననాంగాలు..!
Penis: సాధారణంగా ఒక మగాడికి ఒకే జననాంగం ఉంటుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం పుట్టుకతోనే మూడు జననాంగాలతో పుట్టాడట. విచిత్రం ఏంటంటే.. ఈ విషయం అతనికి కూడా తెలీదు. అతను చనిపోయాక మృతదేహాన్ని రీసెర్చ్ కోసం ఓ హాస్పిటల్‌కు పంపగా అప్పుడు అతనికి మూడు జననాంగాలు ఉన్నాయన్న సంగతి బయటపడిందట. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. 78 ఏళ్ల వ్యక్తి ఇటీవల చనిపోవడంతో అతని మృతదేహాన్ని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హ్యామ్ మెడికల్ స్కూల్‌కి రీసెర్చ్ కోసం అప్పగించారు. పరిశోధన చేస్తున్న సమయంలో బయటికి ఒకే జననాంగం ఉంది కానీ లోపల మాత్రం మరో రెండు ఉన్నట్లు గుర్తించారు.
ఇలా ఒకటికి మించి రెండు జననాంగాలు ఉంటే పాలీఫాలియా అంటారు. ఇలాంటి చాలా అరుదుగా జరుగుతుంటాయి. 60 లక్షల్లో ఒకరికి ఉంటుంది ఈ సమస్య. ఈ వ్యక్తికి మూడు ఉన్నాయి కాబట్టి దీనిని ట్రైఫాలియా అంటారు. ఇది ఇంకా అరుదు. అంటే కొన్ని కోట్ల మందిలో ఒకరికి ఉండటం కూడా అరుదే. 1606 సంవత్సరానికి ముందు ఇలాంటి ట్రైఫాలియా కేసు ఒకటి చూసారట. ఆ తర్వాత మళ్లీ చూడటం ఇదే తొలిసారి అని పరిశోధకులు చెప్తున్నారు. ఇలా ఒకటికి మించి ఎక్కువ జననాంగాలు ఉంటే వారికి ఆ భాగంలో తరచూ ఇన్ఫెక్షన్లు అవుతుంటాయి. శృంగార వాంఛలు అంతగా ఉండవు.