6 రీ రిలీజ్‌లు

prabhas to get 6 re releases on his birthday

Prabhas: రీ రిలీజ్‌ల ట్రెండ్ న‌డుస్తున్న వేళ ఏద‌న్నా హీరో పుట్టిన‌రోజు ఉంటే వారి కెరీర్‌లోని బెస్ట్ సినిమాను రీ రిలీజ్ చేస్తారు. కానీ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజుకి మాత్రం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 6 సినిమాల‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు. ఆ రోజున ఈశ్వ‌ర్, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్, రెబెల్, మిర్చి, స‌లార్, ఛ‌త్ర‌ప‌తి సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయ‌ట‌. కొన్ని షోల‌ను ఉద‌యం 8 గంట‌ల నుంచే వేయ‌నున్నారు. ఈసారి ప్ర‌భాస్ పుట్టిన‌రోజుకి రాజా సాబ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ల ప‌ర్వం కూడా ఉంటుంద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించేసారు.