బాల‌య్య బాబు అన్‌స్టాప‌బుల్‌లో “నంద్యాల” ర‌చ్చ‌

allu arjun to talk about nandyala issue in unstoppable

Allu Arjun: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఆహా సంస్థ కాంబినేష‌న్‌లో అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 టాక్ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఈ షోకి అల్లు అర్జున్ రాబోతున్నార‌ట‌. పుష్ప 2 సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా బ‌న్నీ షోకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఈ షోకి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ పూర్తైపోయింది.

ఈ నేప‌థ్యంలో బాలయ్య బ‌న్నీని నంద్యాల వివాదం గురించి అడిగిన‌ట్లు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో మేన మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన త‌రఫున పోటీ చేస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం నంద్యాల‌కు చెందిన త‌న స్నేహితుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత శిల్పా ర‌విచంద్రకిశోర్ రెడ్డి త‌ర‌ఫున పోటీ చేసేందుకు వెళ్ల‌డం పెద్ద ర‌చ్చ‌కు దారి తీసింది. ఈ అంశం చుట్టూ నెల‌కొన్న వివాదం గురించి బ‌న్నీ అన్‌స్టాప‌బుల్‌లో మాట్లాడార‌ని టాక్. ఈ నెల 24 నుంచి అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 ఆహా వేదిక‌గా ప్ర‌సారం కాబోతోంది.